స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (sbi) మేనేజింగ్ డైరెక్టర్ గా తెలుగు వ్యక్తి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రామమోహనరావును ఎండీగా నియమిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఎస్బీఐ ప్రస్తుత ఛైర్మన్ సీఎస్ శెట్టి కూడా తెలుగు వారే. ఎస్బీఐ బోర్డుకు నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లు, ఒక ఛైర్మన్ ఉంటారు.
రామమోహన్ రావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 29 ఏళ్లగా పనిచేస్తున్నారు. 1991లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ)గా కెరీర్‌ను ప్రారంభించారు. విదేశీ పోస్టింగ్‌లో భాగంగా సింగపూర్‌లో ఎస్బీఐ బ్రాంచీ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత చికాగో బ్రాంచ్ లో సేవలందించారు. ఎస్బీఐ కాలిఫోర్నియా బ్రాంచీ అధ్యక్షుడు, సీఈఓగాను పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.