ఈ మధ్యకాలంలో ముస్లిం వ్యాపారులు ఆహారపదార్ధాల్లో ఉమ్మి వేసి విక్రయిస్తున్న సంఘటనలు తరచుగా ఎదురుచూస్తున్నాయి. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రోజురోజుకూ పెరిగిపోతూ, హిందువులకు భారతదేశంలో సైతం సమస్యలు కలిగిస్తున్నాయి. అలాంటి చర్యలను థూక్ (ఉమ్మివేయడం) జిహాద్‌గా పిలుస్తున్నారు. దాంతో ఏ హోటల్లో ఏం తింటే అందులో ఎవరు ఉమ్మివేసారో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దానికి జవాబుగా అన్నట్లు ఈ యేడాది వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరంలో (డబ్ల్యుహెచ్ఇఎఫ్ 2024) ‘హర్‌హర్’ సంస్థ ప్రారంభమైంది.
2023 మే నెలలో ఉత్తరప్రదేశ్‌లో ఒక ముస్లిం యాజమాన్యం నిర్వహిస్తున్న రెస్టారెంట్లో ఒక వంటవాడు ఆహారంపై ఉమ్మి వేస్తున్న వీడియో బైటపడింది. అది సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. అలాంటి ఆహారం తినేవారికి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది. అనారోగ్యం సంగతి పక్కన పెట్టినా అలాంటి చర్యలు సాధారణ మానవులకు అసహ్యం కలిగిస్తాయి. ఆ వీడియో వైరల్ అయాక పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసారు. అయితే ఆ చర్యను ముస్లిం సామాజిక కార్యకర్త జకీర్ అలీ త్యాగి సమర్ధించారు. అది ప్రార్థనకు సంబంధించిన సంప్రదాయమని, ఆహారాన్ని ఆశీర్వదించే పద్ధతి అని వివరించారు. షియా ముస్లిములలో అది సర్వసాధారణమైన అలవాటు అని చెప్పుకొచ్చారు. అలాంటి సంఘటనలు అంతకుముందు కూడా వెలుగు చూసాయి. 2021 మార్చిలో ఢిల్లీలోని ఒక ముస్లిం యాజమాన్యంలోని హోటల్లో ఆహార పదార్ధాల మీద ఉమ్మివేస్తున్నందుకు ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు.
మరో కేసులో ఒక హిందూ కుటుంబం తమ ఇంట్లో నిశ్చితార్థం కార్యక్రమానికి వంటవాణ్ణి కుదుర్చుకున్నారు. ముస్లిం అయిన ఆ వ్యక్తి ప్రతీ రోటీ మీదా ఉమ్మి వేస్తుండడం వీడియోలో రికార్డ్ అయింది. అతన్ని అరెస్ట్ చేసి విచారించినప్పుడు దిగ్భ్రాంతికరమైన విషయం బైటపడింది. ముస్లిమేతరుల కార్యక్రమాల్లో ఆహారం మీద ఉమ్మి వేసే పద్ధతిని అతను అప్పటికి ఐదేళ్ళుగా చేస్తున్నాడట.
సెలూన్ వ్యాపారంలో దేశవ్యాప్తంగా పేరుగడించి, ప్రముఖ నగరాలు అన్నింటిలోనూ తన పేరుమీదనే దుకాణాలు ప్రారంభించిన జావేద్ హబీబ్ గురించి తెలియనివారు తక్కువే. స్వయంగా జావేద్ హబీబ్ ఒక మహిళకు హెయిర్ కటింగ్ చేస్తున్నప్పుడు ఆమె తల మీద ఉమ్మి వేసాడు. ఆ వీడియో వెలుగు చూడడంతో పెద్ద వివాదమే చెలరేగింది. పాశ్చాత్య దేశాల్లో అయితే అటువంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందన్న చర్చ జరిగింది.
ఇంక బోహ్రా ముస్లిములకు సంబంధించిన సంఘటనలు మరొకలా ఉన్నాయి. ఆహారం వడ్డించే ప్లేట్లను నాకడం, తినే పండ్ల మీద ఉమ్మి వేసి దానితో ఆ పండ్లను కడిగినట్లు చేయడం వంటి చర్యలు వెలుగు చూసాయి. దాన్ని వారు తమ మతపరమైన, సాంస్కృతికమైన చర్యగా సమర్ధించుకున్నారు.
కోవిడ్ మహమ్మారి దేశాన్ని గడగడలాడించిన 2020లో మరో సంఘటన బైటపడింది. తబ్లిగీ జమాత్ సంస్థ సభ్యులు రోడ్ల మీదే కాదు, హెల్త్‌కేర్ వర్కర్ల మీద కూడా ఉమ్మి ఊసిన సందర్భాలు వెలుగు చూసాయి. ఇన్ఫెక్షన్ను వ్యాపింపజేయడమే ప్రధాన లక్ష్యంగా వారు అలా చేసారన్న వాదనలూ వినవచ్చాయి.
అలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో, హిందువులు బైటి ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం దాపురించింది. హిందువులు ఆహారాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ఒకరి ఎంగిలి మరొకరు తినరు. అలాంటిది, తాము తినే ఆహార పదార్ధాల్లో తమకు తెలియకుండా వేరొకరి ఎంగిలి ఉమ్ము కలిసిందంటే అది ఎంత బాధ కలిగిస్తుందన్నది అర్ధం చేసుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ‘హిందూ అసోసియేషన్ ఫర్ రెస్టారెంట్స్, హోటల్స్, ఆహార్ అండ్ రిఫ్రెష్మెంట్స్ – హెచ్ఎఆర్ హెచ్ఎఆర్ – హర్‌హర్’ ఏర్పాటయింది.
హర్‌హర్ ఆవశ్యకత:
భారతదేశంలో ఆహారానికి సాంస్కృతికపరంగా, ఆధ్యాత్మికంగా ఎంతో విలువ ఉంది. అలాంటి చోట, కొన్ని మతాలు, ధర్మాలను లక్ష్యంగా చేసుకుని వారి ఆహారాన్ని ఉమ్మితో కలుషితం చేసే ఉద్దేశపూర్వక చర్యలను ‘థూక్ జిహాద్’గా గుర్తిస్తున్నారు. అలాంటి థూక్ జిహాద్‌ను ఎదుర్కోవడం తక్షణ అవసరంగా మారింది. హిందూ ధర్మంలో ఆహారాన్ని పవిత్రంగా, భగవత్ ప్రసాదంగా భావిస్తాము. శరీరానికే కాక, శరీరంలోని దైవానికి కూడా అర్పణగా సమర్పిస్తాము. ఆహారాన్ని తయారుచేసే ప్రక్రియను పరిశుభ్రంగా, స్వచ్ఛంగా, జాగ్రత్తగా చేపడతాము. దైవనామ స్మరణతో తయారుచేసే ఆహారం మన మనస్సులను సైతం ప్రభావితం చేస్తుందని భావిస్తాము. అలా, శరీరాన్ని పోషించే ఆహారాన్ని పరమ పవిత్రంగా తయారుచేసుకోవాలని భావించే హిందూ సమాజానికి ఇలాంటి థూక్ జిహాద్ చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి చర్యల వల్ల ఆహారాన్ని తయారు చేసి, విక్రయించే ప్రదేశాల్లో నిఘా, జవాబుదారీతనం అవసరమవుతోంది. అందుకే ‘హిందూ అసోసియేషన్ ఆఫ్ రెస్టారెంట్స్, హోటల్స్, ఆహార్ అండ్ రిఫ్రెష్మెంట్స్ – హర్‌హర్’ సంస్థ ఏర్పాటు అవసరం మాత్రమే కాదు, విధాయకం కూడా అయింది.
ఈ యేడాది వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరమ్ 2024 కార్యక్రమం ముంబైలో డిసెంబర్ 13,14,15 తేదీల్లో జరిగింది. సంస్థ వ్యవస్థాపకుడు స్వామి విజ్ఞానానంద ‘హర్‌హర్’ వేదికను ప్రారంభించారు. ఆతిథ్య రంగంలో హిందువులు నడిపే వ్యాపారాల్లో ఆహార శుభ్రతను ధ్రువీకరించే వ్యవస్థగా ఈ హర్‌హర్ ఉంటుందని తెలియజేసారు. ‘హర్‌హర్’ వ్యవస్థ హిందూ సాంస్కృతిక విలువలతో కూడిన ఆహార పదార్ధాల తయారీకి మార్గదర్శకాలను ఏర్పాటు చేస్తుంది. రెస్టారెంట్లు, ఫుడ్ బిజినెస్‌లు పారదర్శకంగా పనిచేస్తున్నాయని, ఆహారాన్ని శుచిగా తయారుచేస్తున్నాయనీ హామీ ఇస్తుంది. ముస్లిముల ఆహారానికి హలాల్ సర్టిఫికేషన్, యూదుల ఆహారానికి కోషెర్ సర్టిఫికేషన్లా హిందువుల కోసం స్వచ్ఛతా ప్రమాణాలతో కూడిన సర్టిఫికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ద్వారా హిందూ సంస్థలు వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనగలవు, ఆతిథ్య పరిశ్రమలో ప్రమాణాలను ఏర్పాటు చేయగలవు.
ఆహార, ఆతిథ్య రంగాల్లో హిందూ వ్యాపారవేత్తలు ఎవరికి వారు పనిచేసుకుంటున్నారు. వారికి కలిసికట్టుగా ఉండే పద్ధతి లేదు. దాంతో ఇతర మతాల వారిలా ‘బార్గెయినింగ్ పవర్’ ఉండడం లేదు. అలాంటి వ్యాపారాలకు కలిసి ఉండేందుకు వనరులను పంచుకునేందుకు, వ్యాపారంలో వచ్చే సమస్యలను పరిష్కరించుకునేందుకు అవసరమైన ఒక వేదికగా ‘హర్‌హర్’ పనిచేస్తుంది.
ఆహార, ఆతిథ్య పరిశ్రమలో వివక్ష, పక్షపాత ధోరణులను ఎదుర్కోడానికి కూడా ఈ సంఘటన సాయపడుతుంది. హిందువులు నిర్వహించే వ్యాపారాలకు తగిన సలహా సూచనలు ఇవ్వడం, కాంపిటీటివ్ మార్కెట్లలో నిలదొక్కుకోడానికి సహాయం చేస్తుంది. వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరం వంటి వేదికల్లో కలవడం ద్వారా హిందూ ఎంటర్ప్రెన్యూర్లు అంతర్జాతీయ వ్యాపార అవకాశాలను, భాగస్వామ్యాలనూ తెలుసుకోవచ్చు.
థూక్ జిహాద్ వంటి వర్తమాన సవాళ్ళను ఎదుర్కొనడం మాత్రమే కాదు, హర్‌హర్ సంఘటన హిందూ ఆహార సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించడానికి వేదికగా నిలుస్తుంది. సంప్రదాయిక శాకాహార విధానాన్ని ప్రమోట్ చేయడం, ప్రాంతీయ పాక పద్ధతులకు ప్రాచుర్యం కల్పించడం ద్వారా సుసంపన్నమైన హిందూ ఆహార సంస్కృతిని ఆధునిక తరానికి తెలియజేస్తుంది.