ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మొగిలియ్య, వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేటి తెల్లవారు జామున ప్రాణాలు విడిచారు.
గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మొగిలయ్య చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి ఖర్చుల కోసం నటుడు ప్రముఖ నటుడు చిరంజీవి, ‘బలగం’ మూవీ దర్శకుడు వేణు సాయం చేశారు.
‘బలగం’ సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చే పాటను ఆలపించి మొగిలయ్య మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత నుంచి మొగిలయ్యను బలగం మొగిలయ్య అని పిలవడం మొదలుపెట్టారు.
మొగిలయ్య మరణంపై పలువురు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి లభించాలని ప్రార్థించారు