జమ్ము కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారంనాడు బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు..
జమ్ము కాశ్మీర్‌లోని కుల్గాంలో ఎన్‌కౌంటర్ జరిగింది.బెహిబాగ్ సమీపంలోని కడ్డర్‌లో తనిఖీలు చేస్తోన్న బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు స్థానిక పోలీసుల సాయంతో, సైనిక బలగాలు గాలింపు చేపట్టాయి. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
పూంచ్, రాజౌరి సెక్టార్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉగ్ర సంచారం ఉండేది. ఇటీవల కాలంలో జమ్ము కశ్మీర్‌లోని పలు జిల్లాల్లో ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. బలగాల కాల్పుల్లో ఉగ్రవాదులు హతమవుతున్నారు. సాధారణ పౌరులు, బలగాలే లక్ష్యంగా ఉగ్ర మూకలు చెలరేగిపోతున్నాయి.