భవానీ దీక్షల విరమణ సమయం దగ్గర పడటంతో భక్తుల కోసం ఇంద్రకీలాద్రిపై విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 21 నుంచి 25 వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరగనుంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి లక్షలాదిగా అమ్మవారికి ఇరుముడి సమర్పించి మాల విరమించనున్నారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భవానీ దీక్ష 2024 (Bhavani Deeksha 2024) పేరుతో ప్రత్యేక యాప్‌ను ఇప్పటికే ఆవిష్కరించిన దేవాదాయశాఖ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది.
యాప్ ను గుగూల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని ఆలయ ఈవో రామారావు తెలిపారు. తద్వారా 24 రకాల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.భవానీ దీక్ష విరమణ సవ్యంగా, సంతోషంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.