భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ రోదసిలో మరికొన్నిరోజులు గడపనున్నారు. మూడోసారి రోదసిలోకి వెళ్ళిన ఆమె, సాంకేతిక కారణాల రిత్యా వచ్చే ఏడాది మార్చి వరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సి వస్తోంది. ఈ విషయాన్ని నాసా వెల్లడించింది.
సునీత, విల్మోర్ లు జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సిఉంది. కానీ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురుయ్యాయి. అందువల్ల అంతరిక్షంలో ఉండాల్సి వస్తోంది.
ఈ క్రమంలోనే స్పేస్ఎక్స్ క్రూ-9 మిషన్ ప్రయోగం చేపట్టారు. అంతరిక్షంలో చిక్కుకున్నవారిని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు ఇందులో రెండు సీట్లు ఖాళీగా పంపించారు. సెప్టెంబరులోనే అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. దీంతో నలుగురు ఫిబ్రవరిలో తిరిగి వస్తారని నాసా తొలుత ప్రకటించింది. క్రూ-9 సిబ్బందిని రిలీవ్ చేసేందుకు చేపట్టిన క్రూ-10 మిషన్ ప్రయోగం మార్చి తర్వాతే జరగనుంది. దీంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి పైకి వచ్చే విషయంలో జాప్యం జరుగుతోంది.
సునీతా విలియమ్స్ 2006, 2012లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ నిర్వహించి 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఐఎస్ఎస్లో ఓసారి మారథాన్ చేసిన సునీత, ఈ దఫా ఆనందంతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.