ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామికి ఆలయంలో గడిచిన 26 రోజులకు గాను హుండీలలో భక్తులు సమర్పించిన నగదు, ఇతర కానుకలను అధికారులు లెక్కించారు. గత 26 రోజులకు రూ.5,96,92,376 కోట్లు ఆదాయం కానుకుల రూపంలో లభించిందని ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు.
నగదుతో పాటు 232 . 400 మిల్లీ గ్రాముల బంగారం, 7 కేజీల 850 గ్రాములు వెండిని భక్తులు కానుకగా ఆదిదంపతులకు సమర్పించారు. విదేశీ కరెన్సీని లెక్కగట్టగా యూఎస్ఏ డాలర్లు 558, సౌదీఅరేబియా రియాల్స్ 3, ఓమన్ బైసా 200, కువైట్ దినార్ 12, కత్తారు రియాల్స్ 4, సింగపూర్ డాలర్లు 7 స్వామిఅమ్మవార్లకు సమర్పించినట్లు తేలింది.
ఆస్ట్రేలియా డాలర్లు 60, కెనడా డాలర్లు 35, హాంకాంగ్ డాలర్లు 10, యూకే పౌండ్లు 5, ఈరోస్ 115, కెన్యా షిల్లింగ్స్ 50, ఫిలిపిన్స్ పిసో 20, యూఏఈ దిర్హమ్స్ 15, జాంబియా క్వచ 20, జపాన్ యాన్స్ 1000 విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయని అధికారులు వెల్లడించారు.