ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ‘దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి’కిగాను కేంద్ర సాహిత్య అకాడమీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. లక్ష్మీనారాయణ ప్రస్తుతం అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
దాదాపు 45 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘంలో వివిధ హోదాల్లో లక్ష్మీనారాయణ పనిచేశారు. ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా సేవలందించారు. ఎనిమిదేళ్ళ పాటు జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. వివిధ విమర్శనా గ్రంథాలు రాయడంతో పాటు అనేక కథాసంపుటాలకు సంపాదకులుగా వ్యవహరించారు.