ఉత్తరప్రదేశ్‌లో అడుగడుగునా ఓ గుడి దొరుకుతోంది. ఇన్నాళ్ళూ మరచిపోయిన చరిత్ర, ఆ ప్రాంత ఆధ్యాత్మిక వారసత్వం వెలుగు చూస్తున్నాయి. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ముస్లిముల దురాక్రమణల కారణంగా మరుగున పడిపోయిన దేవాలయాలు ఇప్పుడు బైటపడుతున్నాయి. ఆ క్రమంలో శంబలలో తాజాగా మరో దేవాలయం ఎన్నోయేళ్ళ తర్వాత తెరుచుకుంది.
శంబలలోని (సంభాల్) సరయ్ తరిన్ ప్రాంతంలో ఒక రాధాకృష్ణ మందిరం తలుపులు కొన్ని దశాబ్దాల తర్వాత తెరుచుకున్నాయి. ఒకప్పుడు హిందువుల పూజాపునస్కారాలతో ఎల్లప్పుడూ సందడిగా ఉండే ఆలయం అక్కడి నుంచి హిందువులు తరలివెళ్ళిపోవలసి రావడంతో మూతపడిపోయింది. ఎన్నోయేళ్ళుగా ఆ గుడిలో దీపం వెలగలేదు. ఏవైనా పండుగ సందర్భాల్లో అప్పుడప్పుడూ తెరిచేవారంతే.
తాజాగా నిన్న మంగళవారం నాడు ఆ గుడి తలుపులు తెరుచుకున్నాయి. స్థానిక అధికారులు తమకు వచ్చిన సమాచారం ఆధారంగా గుడిని కనుగొన్నారు. పోలీసులు, స్థానిక యంత్రాంగం గుడిని శుభ్రం చేసి, ఆలయాన్ని పునరుద్ధరించే పనులు ప్రారంభించారు.
యూపీలో, ప్రత్యేకించి శంబలలో ముస్లిములు అక్రమంగా ఆక్రమించి అన్యాయంగా గుళ్ళ మీద ఇళ్ళు కట్టేసుకుని విద్యుత్ చౌర్యాలకు పాల్పడుతూ ఇన్నాళ్ళూ చేస్తున్న దుర్మార్గాల మీద ఎట్టకేలకు చర్యలు మొదలయ్యాయి. శంబలలోని షాహీ జామా మసీదు వద్ద ప్రభుత్వ అధికారులు ఆక్రమణల తొలగింపు పనులు మొదలుపెట్టారు. ఆ క్రమంలో డిసెంబర్ 13న కార్తిక మహాదేవ మందిరం బైటపడింది.
అదే క్రమంలో డిసెంబర్ 14న మరో దేవాలయం వెలుగుచూసింది. 46ఏళ్ళుగా ముస్లిముల ఇళ్ళ మధ్యలో మగ్గిపోతూ హిందువులకు దూరమైపోయిన శివాలయం బైటపడింది. మహమూద్‌ఖాన్ సరాయ్ ప్రాంతంలో తాళం పెట్టి ఉన్న ఒక ఇంటిలోపల గుడి కనిపించింది. 1976లో మతకలహాల సమయంలో ఆ గుడిని ఆక్రమించి మూసేసారు. ఇన్నాళ్ళకు ఆ మందిరం బైటపడడంతో స్థానిక చరిత్ర గురించి ప్రజల్లో ఆసక్తి మొదలైంది. ఆ గుడి దగ్గర అన్వేషణలో ఒక పాత పాడుబడిన బావి కనిపించింది. దానిలో 25 అడుగుల లోతున హిందూ దేవీదేవతల శిథిల విగ్రహాలు మూడు లభించాయి. ఇప్పుడు ఆ శివ-హనుమాన్ ఆలయంలో పూజాదికాలు మొదలుపెట్టారు.
దాదాపు అదే సమయంలో వారణాసిలో మరో ప్రాచీన దేవాలయం డిసెంబర్ 16న బైటపడింది. వారణాసిలో ముస్లిముల జనావాసంగా పేరుపడిన మదన్‌పురా ప్రాంతంలో సిద్ధేశ్వర మహాదేవుడి దేవాలయం ఆచూకీ తెలిసింది. సనాతన రక్షాదళ్ అనే పేరున్న స్థానిక హిందూ సంస్థ అన్వేషణలో 250ఏళ్ళనాటి ఆ గుడి బైటపడింది. ప్రసిద్ధ పురాణం కాశీఖండంలో కూడా ఆ దేవాలయం ప్రస్తావన ఉంది. కనీసం పదేళ్ళకు పైబడిన కాలం నుంచీ ఆ గుడిని మూతపెట్టేసారు. ఇప్పుడు ఆ గుడిని మళ్ళీ తెరిచారు. అక్కడ పటిష్ట భద్రత ఏర్పాటు చేసారు.