అంతర్జాతీయ క్రికెట్ కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్
భారత సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో అశ్విన్ తన రిటైర్మెంట్ గురించి వెల్లడించాడు.
భారత్ తరఫున క్రికెట్ ఆడినందుకు గర్వంగా భావిస్తున్నానని తెలిపిన అశ్విన్, కెరీర్లో 106 టెస్టులు ఆడి 537 వికెట్లు తీశాడు. అలాగే 3,503 పరుగులు చేశాడు. భారత్ తరఫున 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. ఓవరాల్గా 765 వికెట్లు తీసి జట్టుకు అండగా నిలిచాడు.
అశ్విన్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ, మిగిలిన రెండు టెస్టులో అతడు ఆడడని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అశ్విన్ సేవలను బీసీసీఐ కొనియాడింది. తెలివైన బౌలర్ అంటూ ప్రశంసించింది. భారత విజయాల్లో అశ్విన్ కీలక పాత్ర పోషించాడని కొనియాడింది.