Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

మంగళగిరి ఎయిమ్స్‌కు మరో 10 ఎకరాలు కేటాయిస్తాం: స్నాతకోత్సవంలో చంద్రబాబు

Phaneendra by Phaneendra
Dec 17, 2024, 05:57 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మెడికల్ సైన్స్‌లో టెక్నాలజీని వినియోగించడం ద్వారా వైద్యరంగంలో అద్భుతాలు సాధించవచ్చని, రోగుల చెంతకే వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మెడికల్ సైన్స్ ఇప్పుడు మెడ్‌టెక్ సైన్స్ అయ్యిందన్నారు. డీప్‌టెక్ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానంపై వైద్య విద్యార్ధులు పట్టు సాధించాలని, రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఆస్పత్రులకు రాకుండా చికిత్స అందించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని చెప్పారు. మంగళవారం మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగిన మొదటి స్నాతకోత్సవానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. 

రాష్ట్రపతి ముర్ము అందరికీ స్ఫూర్తి :

ఒడిశాలోని ఒక మారుమూల గ్రామంలోని గిరిజన కుటుంబం నుంచి రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము వచ్చారని, రాష్ట్రపతి స్థాయి వరకు ఎదగడం అందరికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కొనియాడారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె ప్రొఫెసర్‌గా, జూనియర్ అసిస్టెంట్‌గా, కౌన్సిలర్‌గా, చైర్‌పర్సన్‌గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, గవర్నర్‌గా.. ఇలా పలు బాధ్యతలు నిర్వర్తించారని.. దేశానికి ప్రథమ పౌరురాలు అయ్యారని..అంతే పట్టుదలగా కష్టపడితే ఎవరైనా ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని రాష్ట్రపతి నిరూపించారని ముఖ్యమంత్రి అన్నారు.

ఎయిమ్స్‌కు సంపూర్ణ సహకారం :

మంగళగిరి ఎయిమ్స్‌కు దేశంలో మరే ఎయిమ్స్‌కు లేనట్టుగా 183 ఎకరాల భూమి ఇచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు. భవిష్యత్ అవసరాల కోసం మరింత భూమిని ఇవ్వాల్సిందిగా ఇటీవల ఎయిమ్స్ అధికార వర్గాలు తనను కోరాయని, త్వరలోనే మరో 10 ఎకరాలు ఎయిమ్స్‌కు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. 2018లో తమ ప్రభుత్వ హయాంలోనే ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేశామని, 960 బెడ్‌లతో రూ.1618 కోట్లతో దీనిని నిర్మించారని చెప్పారు. ఎయిమ్స్‌కు అప్రోచ్ రోడ్లు, జాతీయ రహదారితో అనుసంధానం, విద్యుత్ సరఫరా, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని, భవిష్యత్‌లో మరింతగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌లో రోగులకు రూ.10కే వైద్య సేవలు అందించడాన్ని ఆయన అభినందించారు. మంగళగిరి ఎయిమ్స్ ప్రస్తుతం ర్యాంకింగ్‌లో దేశంలో 8వ స్థానంలో ఉందని, త్వరలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.

కేంద్రం అండగా ఉంది :

ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎం, గిరిజన విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ సహా పలు కేంద్ర విద్యా సంస్థలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి నగరాన్ని వచ్చే మూడేళ్లలో దాదాపు రూ. 50 వేల కోట్లతో అత్యద్భుతంగా నిర్మిస్తామన్నారు. ఎయిమ్స్ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవడానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కల్యాణ్‌తో కలిసి గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

Tags: AIIMS- MangalagiriAP CM N Chandrababu NaiduDy. CM Pawan Kalyanfirst convocationPresident Draupadi MurmuSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

నేడు ఏపీలో భారీ వర్షాలు
general

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర
Latest News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం
general

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం
general

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

Latest News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.