అమెరికా ఫెడ్ వడ్డీరేట్లను పెంచబోతోందనే అంచనాలతో దేశీయ స్టాక్ సూచీలు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగానూ సానుకూల సంకేతాలు లేకపోవడంతో స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన స్టాక్ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 1064 పాయింట్ల నష్టంతో 80684 వద్ద ముగిసింది. నిఫ్టీ 322 పాయింట్లు కోల్పోయి 24336 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో ఐటీసీ లాభాలు ఆర్జించింది. టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. బ్యారెల్ క్రూడాయిల్ 73.65 అమెరికా డాలర్లకు పెరిగింది. బంగారం ధర (gold price) స్థిరంగా కొనసాగుతోంది. ఔన్సు పసిడి ధర 2655 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రూపాయి బలహీన పడింది. డాలరుతో రూపాయి విలువ 84.57కు పడిపోయింది.