సమాజంలోని అన్నివర్గాల సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. దేశ పురోగతికి దోహదపడేలా యువతను తీర్చిదిద్దాలన్నారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మోహన్ భాగవత్ , సమాజంలో ప్రతిదీ తప్పుగా జరుగుతోందనే అభిప్రాయం పెరగడం సరికాదని ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రతీ ఒక్కరూ అహాన్ని వీడికపోతే అగాధంలో పడిపోతామని హెచ్చరించారు. శాశ్వతమైన ఆనందాన్ని గుర్తించినప్పుడే నిస్వార్థమైన సేవ చేస్తారని, అదే ఇతరులకు సహాయపడే ధోరణిని పెంచుతుందని హితవు పలికారు. సేవ మాత్రమే సమాజంలో శాశ్వతమైన నమ్మకాన్ని పెంచుతుందన్నారు.
సమాజంలో ఒక ప్రతీకూల అంశం జరిగేతే దానికి 40 రెట్లు మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు . రామకృష్ణ పరమహంస చెప్పినట్లు ప్రతీ ఒక్కరిలో రెండు ‘నేను’లు ఉంటాయన్నారు. ఒకటి ముడిపదార్థమైతే , మరొకటి పరిపక్వత చెందినది అని పరమహంస బోధనలు గుర్తు చేశారు.