నియామక పరీక్షల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజన్సీని తొలగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎన్టీఏ కేవలం ప్రవేశ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. కేంద్రం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2025 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
వైద్య విద్యలో ప్రవేశ పరీక్షలు ఎన్టిఏ నిర్వహిస్తుంది. అయితే పెన్ను, పేపర్ ఉయోగించాలా? కంప్యూటర్ ద్వారా నిర్వహించాలా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి వచ్చే అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకోనున్నారు. అయితే పరీక్షలన్నీ ఆన్లైన్ ద్వారా కంప్యూటర్లపై నిర్వహించాలని కేంద్రం గతంలోనే ఓ నిర్ణయం తీసుకుంది.
నియామక పరీక్షల నుంచి నీట్‌ను తప్పించి జీరో ఎర్రర్ విధానంలో పరీక్షలు నిర్వహించున్నారు. గత ఏడాది నీట్ పరీక్షల్లో పేపర్ లీకు వ్యవహారం దేశ వ్యాప్తంగా పెద్ద రచ్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా కేంద్రం నీట్‌ను సంస్కరించనుంది.