ఎయిమ్స్- మంగళగిరి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారతీయ మహిళలు అన్ని రంగాల్లో పురోగమిస్తున్నారని ప్రశంస
భారతీయ వైద్యులకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అన్నారు.
మంగళగిరిలోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఎంబీబీఎస్ లో ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు అందజేశారు.
మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించిన ద్రౌపది ముర్ము, వైద్యుల్లో 2/3 వంతు మహిళలు ఉన్నరన్నారు. ఎయిమ్స్ మొదటి బ్యాచ్‌గా ప్రస్తుత విద్యార్థులు గుర్తుంటారన్నారు.
దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆకాంక్షించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యోగాసనాలు, ప్రాణాయామాలు చేయడం మంచిదన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు మెరుగైనఆరోగ్య సేవలు తేలిగ్గా అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు శాలువ కప్పి సన్మానించి తిరుమల శ్రీవారి మెమొంటోను బహుకరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నజీర్, కేంద్ర ఆయూష్ శాఖ మంత్రి ప్రకాష్ రావు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ , సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు.