బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో భాగంగా నాలుగో రోజు ఆట ముగిసింది. మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించినప్పటికీ మళ్ళీ కొనసాగింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు నష్టపోయి 252 పరుగులు చేసింది. దీంతో ఫాలో ఆన్ గండం తప్పింది.
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 445 పరుగులు చేయగా , లక్ష్య ఛేదనలో భారత్ పేలవ ప్రదర్శనతో ఉసురుమనిపించింది. కేఎల్ రాహుల్(84), లో జడేజా(77) శ్రమతో ఫాలో ఆన్ గండం తప్పింది. ఆఖర్లో ఒక్కో పరుగు చేరుస్తూ బుమ్రా(10*) , ఆకాశ్ దీప్ (27*) స్కోర్ బోర్డును 252కు చేర్చారు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (16) ఏడో వికెట్ గా వెనుదిరిగాడు. ఆసీస్ కంటే భారత్ ఇంకా 193 పరుగుల వెనుకంజలో ఉంది.
ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ నాలుగు వికెట్లు తీయగా, మిచెల్ స్టార్ మూడు వికెట్లు పడగొట్టాడు. నాథన్ లైయన్,హజల్ వుడ్ చెరొక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.