డగౌట్ వద్దే గ్లౌజులు పడేసి అసహనం
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ , రిటైర్మంట్ ప్రకటించబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గబ్బా టెస్టులో 27 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 10 పరుగులు చేసి వెనుతిరిగాడు.
హిట్ మ్యాన్ తనదైన దూకుడు ఆటతో కష్టాల్లో ఉన్న జట్టును కాపాడతాడని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే దక్కింది. పరుగుల సంగతి పక్కన పెడితే ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి తెగ ఇబ్బంది పడ్డాడు. క్యాచ్ ఔట్ గా పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో తీవ్రనిరాశలో రోహిత్ ఉన్నట్లు గా అర్థం అవుతోంది. డగౌట్ దగ్గరే గ్లౌజులు పడేసి వెళ్లాడు.
ఆసీస్ పర్యటనలో రోహిత్ విఫలం కావడంపై ట్రోలర్స్ ఆయన్ను టార్గెట్ చేశారు. నెట్టింట రోహిత్ లక్ష్యంగా మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. రోహిత్ శర్మ గత 13 టెస్టు ఇన్నింగ్స్‌లలో ఎనిమిది సార్లు సింగిల్ డిజిట్ స్కోరర్లకే వెనుదిరిగాడు. 11.69 సగటుతో 152 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ అర్ధ సెంచరీ ఉంది.