265 పరుగులు వెనకబడిన భారత్ …
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ కు వరుణుడు తరుచూ అంతరాయం కలిగిస్తున్నాడు. నాలుగో రోజు ఆటకు అంతరాయం కలిగించడంతో ఆటను నిలిపివేశారు. ఆటను నిలిపివేసే సమయానికి భారత్ ఆరు వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే భారత్ ఇంకా 66 పరుగులు చేయాలి. క్రీజులో రవీంద్ర జడేజా(62), నితీశ్ కుమార్ రెడ్డి (9) ఉన్నారు.
ఓవర్‌నైట్ స్కోర్ 51/4 తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్, ఆదిలోనే వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ(10) వికెట్ కోల్పోయింది.ఆ తర్వాత కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు. క్లిష్ట సమయంలో 84 పరుగులు చేసి సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రాహుల్‌ను నాథన్ లైయన్ పెవిలియన్ కు పంపాడు. దీంతో భారత్ ఆరో వికెట్ నష్టపోయింది.
తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 445 పరుగులు చేసింది. భారత్ మరో 265 పరుగులు చేస్తే తొలి ఇన్నింగ్స్ లక్ష్యాన్ని అందుకుంటుంది.
రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ బౌలర్ల మిచిల్ స్టార్క్, పాట్ కమిన్స్ చెరో రెండు వికెట్లు తీశారు. హజల వుడ్, నాథన్ లైయన్ చెరొక వికెట్ పడగొట్టారు