ఉత్తరప్రదేశ్‌లోని శంబలలో (సంభాల్) భారీ స్థాయిలో ఆక్రమణల తొలగింపు డ్రైవ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికారులు ఇటీవల తెరిపించిన శివాలయం దగ్గరున్న బావిలో దేవీ దేవతల విగ్రహాలు దొరికాయి.
శివ-హనుమాన్ ఆలయం దగ్గర ఉన్న బావిలోకి చాలా శిథిలాలు విసిరేసారని సంభాల్ ఏఎస్పీ శిరీష్ చంద్ర మీడియాకు వివరించారు. ఇప్పటికి మూడు విగ్రహాలు లభ్యమయ్యాయి. వాటిలో ఒకటి వినాయకుడిది కాగా మరొకటి కుమారస్వామి విగ్రహం.
శివ-హనుమాన్ ఆలయం 1978 వరకూ వాడుకలో ఉండేది. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని ముస్లిములు దౌర్జన్యంగా చుట్టుముట్టి ఆక్రమించేసి ఆ గుడిపై ఇళ్ళు కట్టేసుకున్నారు. ఇటీవలి హింసాకాండ తర్వాత ఆ ప్రాంతంలో పోలీసులు అక్రమ విద్యుత్ కనెక్షన్లను గమనించి, వాటిని తొలగింపజేసే క్రమంలో ఆ ఆలయం బైటపడింది. ఆ ప్రాంతాన్ని రక్షించిన పోలీసులు ఇప్పుడు అక్కడి దేవతా విగ్రహాలపై దృష్టి సారించారు. నాలుగున్నర దశాబ్దాల తర్వాత ఇన్నాళ్ళకు తెరుచుకున్న ఆ గుడిలో పూజా పునస్కారాలు, దర్శనాలకు తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
శంబలలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా నిర్మాణాలు చేసుకుని దశాబ్దాల తరబడి తిష్ట వేసేసారు. అలాంటి చోట్ల పెద్దసంఖ్యలో ముస్లిములు వచ్చిచేరి తమ ప్రాంతాలుగా మార్చేసుకుంటున్నారు. అక్కడ మసీదులు కట్టేస్తున్నారు. ఇంక విద్యుత్ చౌర్యం గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇన్నాళ్ళకు అలాంటి ఆక్రమణలను తొలగించే ప్రక్రియ మొదలైంది. ఆ క్రమంలోనే శివ-హనుమాన్ ఆలయం బైటపడింది.