గబ్బా టెస్టులో ఆటగాళ్లతో వరుణుడు ఆడుకున్నాడు. ఆసీస్ బౌలర్లను, భారత బ్యాటర్లను విసిగించాడు. వర్షం వల్ల ఇవాళ ఆట 33 ఓవర్లకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 17 ఓవర్లు ఆడి 51 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది.ఆట వాయిదా పడే సమయానికి కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ క్రీజ్‌లో ఉన్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 394 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్‌ను 445 పరుగులకే ఆలౌట్ చేసిన భారత టీం తొలి ఇన్నింగ్స్ బౌండరీలతో ప్రారంభించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి బంతిని బౌండరీకి తరలించాడు. రెండో బాల్కే అవుటయ్యాడు. మరోసారి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు.
తరవాత బ్యాటింగ్‌కు దిగిన శుభ్‌మన్ గిల్ నిరాశపరిచాడు. ఒక్క పరుగు చేసి మూడో బంతికే పెవిలియన్ దారి పట్టాడు. విరాట్ కోహ్లీ 3 పరుగులకే అవుటయ్యాడు. ఆఫ్ సైడ్ బంతిని ఆడి, పెవిరియన్ చేరాడు.అప్పటకే వర్షం కారణంగా ఆట రెండు సార్లు నిలిచిపోయింది. రిషబ్ పంత్‌ను కమిన్స్ అవుట్ చేశాడు. దీంతో భారత్ 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరోసారి వర్షం రావడంతో మ్యాచ్ నిలిపివేశారు.