వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవల ఆయనపై నమోదైన ఫోక్సో కేసు క్వాష్ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కేసును కొట్టివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్ వేయాలని ఏజీ ఆదేశించింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారంలో తనపై నమోదైన కేసుల విషయంలో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ సజ్జల భార్గవ్‌రెడ్డి పెట్టుకున్న పిటీషన్ విచారణకు వచ్చింది. భార్గవ్‌రెడ్డి ఎలాంటి దూకుడు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.అరెస్టు చేయవద్దని కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో అరెస్టు నుంచి సజ్జల భార్గవ్ రెడ్డి ఊరటలభించినట్టైంది.
వైసీపీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడిగా సజ్జల భార్గవ్‌రెడ్డి పనిచేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిళ, విజయమ్మ, వైఎస్. సునీతలపై అసభ్యకర పోస్టులు పెట్టించారంటూ భార్గవ్‌రెడ్డిపై 11 కేసులు నమోదయ్యాయి.