తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత
ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. రక్తపోటు సంబంధిత అనారోగ్యంతో అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ గత రాత్రి తుది శ్వాస విడిచారు. 1951లో ముంబైలో జన్మించిన జాకీర్ హుస్సేన్ తండ్రి బాటలో నడిచారు. జాకీర్ హుస్సేన్ తండ్రి అల్లారఖా కూడా సంగీతంలో దిట్ట. అల్లారఖా పెద్దకుమారుడు జాకీర్ హుస్సేన్. తండ్రి వద్ద చిన్ననాటి నుంచే సంగీతం నేర్చుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇవ్వడంతోపాటు, ఆరు గ్రామీ అవార్డులు అందుకుని ఔరా అనిపించారు
జాకీర్ హుస్సేన్ చిన్ననాటి నుంచే ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. దేశ, విదేశాల్లో సంగీతప్రియులకు జాకీర్ హుస్సేన్ సుపరిచితులు. ఆయన ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 66వ గ్రామీ అవార్డుల్లోనూ జాకీర్ హుస్సేన్ సత్తాచాటారు.
జాకీర్ హుస్సేన్ మరణించాంటూ ఆదివారం అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆయన కుటుంబసభ్యులు ఖండించారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇవాళ ఉదయం ఆయన మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు.