విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో పౌర్ణమి తిథి సందర్భంగా గిరిప్రదక్షిణ నిర్వహించారు. ఆదిదంపతులుగా పూజలందుకుంటున్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్లకు గిరిప్రదక్షిణ నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ లోని శ్రీ కామదేను అమ్మవారి దేవస్థానం నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ వైదిక సిబ్బంది, ఈవో కె ఎస్ రామారావు పూజలు నిర్వహించారు.