దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం స్పష్టంగా కనిపిస్తోంది. డిజిటల్ భారత్ కల సాకరమైంది. గత జనవరి నుంచి నవంబరు వరకు 15547 కోట్ల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీలు జరిగాయని కేంద్రం తెలిపింది. దీని ద్వారా జనవరి నుంచి నవంబరు వరకు రూ. 223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా యూపీఐ చెల్లింపులు జరుగుతున్నాయి. పారదర్శకంగా జరిగేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది. ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతోపాటు ప్రతి వ్యక్తి చేతిలోకి మొబైల్ నెట్ అందుబాటులోకి రావడంతో డిజిటల్ చెల్లింపులు పరుగులు పెడుతున్నాయి. తాజాగా సింగపూర్, నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాల్లోనూ డిజిటల్ చెల్లింపులు వేగం పుంజుకున్నాయి. గత నెలలో 1658 కోట్ల లావాదేవీల ద్వారా రూ.23 లక్షల కోట్లకుపైగా చెల్లింపులు జరిగాయి.