అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని పరిమళ మృత్యువాతపడ్డారు. శనివారం ఆమె చదువుకుంటోన్న యూనివర్శిటీ నుంచి ఇంటికి వచ్చే సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పరిమళ ప్రయాణిస్తోన్న కారును ఓ ట్రక్ బలంగా ఢీ కొట్టడంతో ఆమె చనిపోయారు.
తెనాలికి చెందిన గణేశ్, రమాదేవిల కుమార్తె నాగశ్రీవందన పరిమళ. టెన్నెసీలో ఎంఎస్ చదువుతోంది. 2022లో అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించడానికి వెళ్లిన పరిమళ, ప్రమాదంలో చనిపోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. పరిమళ తల్లిదండ్రులను మంత్రి నాదెండ్ల మనోహన్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరామర్శించారు. ఆమె మృతదేహాన్ని తెనాలికి తెప్పించేందుకు తానా ప్రతినిధులతో చర్చించారు. సాధ్యమైనంత త్వరగా పరిమళ మృతదేహాన్ని తెనాలికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.