ఆధార్ ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువు రేపటితో ముగియనుండగా ఉదయ్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఆరు నెలలపాటు ఆధార్‌లో వివరాలు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చని ఉదయ్ ప్రకటించింది. ఆధార్ తీసుకుని పది సంవత్సాలు పూర్తి అయిన వారు ఫోటో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఫోటో, చిరునామా వివరాలు ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు మరో 6 నెలలు పొడగించారు.
దేశంలో 140 కోట్ల మందికి ఆధార్ కార్డు అందుబాటులోకి వచ్చింది. వీరిలో చాలామంది పదేళ్ల కిందటే ఆధార్ కార్డు తీసుకున్నారు. వీరిలో చాలా మంది నేటికీ ఫోటోలు అప్‌డేట్ చేసుకోలేదు. దీనికితోడు అడ్రస్ మారిన వారు వివరాలు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేసుకోకుంటే రద్దవుతుందంటూ వస్తున్న వార్తలను ఉదయ్ ఖండించింది.ఆధార్ అప్‌డేట్ చేయని వారు మై ఆధార్ ద్వారా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చని తాజాగా ప్రకటించింది.