కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోమవారం రాజ్యాంగం (129వ సవరణ) బిల్లు 2024ను లోక్సభలో సోమవారం డిసెంబర్ 16న ప్రవేశపెడతారు. లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు ఒకేసారి జరపాలని ప్రతిపాదించే జమిలి ఎన్నికల బిల్లు అది. ఢిల్లీ, జమ్మూకశ్మీర్, పుదుచ్చేరి శాసనసభలను కూడా వాటితో పాటే జరపాలంటూ మరో బిల్లు ప్రవేశపెడతారు.
వాటితో పాటే అర్జున్ రామ్ మేఘ్వాల్ కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు 2024ను కూడా లోక్సభలో ప్రవేశపెడతారు. 1963 నాటి కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన బిల్లు అది. తద్వారా ఢిల్లీ, జమ్మూకశ్మీర్లకు సంబంధించిన చట్టాలను సవరించే ప్రయత్నం చేస్తారు.
ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనను చాలామంది ప్రతిపక్ష నాయకులు తప్పుపట్టారు. అది ఆచరణ సాధ్యం కాదని, భారత సార్వభౌమత్వంపై దాడి చేయడమే అనీ ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ‘‘ఒక రాష్ట్రప్రభుత్వం ఆరు నెలల్లో పతనమైపోతేనో, లేక మెజారిటీ కోల్పోతేనో, ఆ రాష్ట్రం మరో 4.5ఏళ్ళు ప్రభుత్వం లేకుండా గడపాలా’’ అని ప్రశ్నించారు.
జమిలి ఎన్నికలను అమలు చేయడానికి గురువారం కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దానిపై సమగ్ర బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ అంశంపై నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సెప్టెంబర్లో చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆ నెలలోనే ఆమోదించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలాకాలం క్రితమే స్వల్పకాల అవధికి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. అప్పుడు ఐదేళ్ళ పరిపాలనా కాలాన్ని రాజకీయ ప్రచార కార్యక్రమాలు కమ్మివేయకుండా ఉండడం సాధ్యమవుతుంది. భారతదేశంలో మొట్టమొదటిసారి 1951-52 శీతాకాలంలో జరిగిన ఎన్నికలు జమిలి ఎన్నికల విధానానికి మంచి ఉదాహరణ. అయితే దాన్ని 1967లో నిలిపివేసారని మోదీ గుర్తుచేసుకున్నారు.