బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ మొదటి రోజు ఆటకు వరణుడు ఆటంకం కలిగించాడు. లంచ్ బ్రేక్ సమయం నుంచి మొదలైన జల్లులు తగ్గకపోవడంతో తొలిరోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
గబ్బాలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆట13.2 ఓవర్లకు చేరుకోగనే చినుకులు పడ్డాయి. అప్పటికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.
ఖవాజా( 19), మెక్స్వీనే( 4) పరుగులు చేసి క్రీజ్లో ఉన్నారు. భారత్ తరపున బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ బౌలింగ్ చేశారు. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇరు జట్లు 1-1 తేడాతో సమంగా ఉన్నాయి.
భారత జట్టులో ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో ఆడుతోంది. అశ్విన్, హర్షిత్ రాణా స్థానంలో జడేజా, ఆకాశ్దీప్లకు అవకాశం దొరికింది. ఆస్ట్రేలియా జట్టులో స్కాట్ బోలాండ్ స్థానంలో హాజెల్వుడ్కు ఛాన్స్ దొరికింది.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల