ఎస్సీ ఉపవర్గీకరణ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కమిషన్ ఏర్పాటు చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమిస్తూ ఏపీ ఎన్డీయే సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ ఈ నెల 16 నుంచి 19 వరకు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల పరిధిలో పర్యటించి సంబంధిత వర్గాల నుంచి సమాచారం సేకరిస్తామని తెలిపింది. వ్యక్తులు లేదా సంస్థల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలు సేకరించనుంది.
నేరుగా వినతులు సమర్పించలేని వారు విజయవాడ మొగల్రాజపురంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ కార్యాలయంలో కూడా తమ వినతి అందజేయవచ్చు. రసీదుతో కూడిన రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా ఈ మెయిల్ (omcscsubclassification@gmail.com) ద్వారా జనవరి 9లోగా పంపాలని సూచించింది.