భారత్‌కు స్విట్జర్లాండ్ ఊహించని షాకిచ్చింది. భారత్‌కు గతంలో ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేసింది. అత్యంత సానుకూల దేశాల హోదా పొందిన దేశాల మధ్య వర్తక, వాణిజ్యాలు స్వేచ్ఛగా జరుగుతాయి. పెట్టుబడులకు కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. గతంలో భారత్‌ను అంత్యంత సానుకూల దేశంగా గుర్తింపునిచ్చిన స్విట్జర్లాండ్ తాజాగా తొలగించడం చర్చకు దారితీసింది.
నెస్లే కేసులో సుప్రీంకోర్టు 2017లో స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఆ తీర్పును సవాల్ చేయడంతో దానిపై కొంత కాలంగా వాదనలు జరుగుతున్నాయి. తీర్పులో కొంత మార్పులు చేస్తూ స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. దీంతో స్వింట్జర్లాండ్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని తెలుస్తోంది.
స్విట్జర్లాండ్ నిర్ణయంతో ఆ దేశంలో భారత పెట్టుబడిదారులకు పెద్ద ఎదురు దెబ్బ తగలనుంది. పన్నులు భారీగా పెరగనున్నాయి. రెండు దేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్యానికి ఇది పెద్ద దెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు.