నటుడు అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
పుష్ప 2 సినిమా చూసేందుకు హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది.
ఇవాళ పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.దీంతో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. మహిళ మృతికి అల్లు అర్జున్‌కు సంబంధం లేదని ప్రముఖ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేసు క్వాష్ చేయాలని కోరారు. గతంలోఇలాంటి కేసులో అలహాబాద్ కోర్టు తీర్పును ఉఠంకించారు.
కేసును పరిశీలించిన న్యాయమూర్తి అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. దీంతో అల్లు అర్జున్, ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.