తిరుమలలో కురిసిన వర్షాలతో శేషాచల అటవీప్రాంతంలోని ప్రధాన జలాశయాలు నిండాయి.తిరుమల పరిధిలోని పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. పాపవినాశనం, గోగర్భం జలాశయాల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలు పొంగుతున్నాయి. తిరుమల పరిధిలోని జలాశయాల్లోని నీటి నిల్వలు 355 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయని జలవనరుల శాఖ నిపుణులు చెబుతున్నారు.
.
శుక్రవారం నాటికి జలాశయాల నీటిమట్టం వివరాలు..
1) పాపవినాశనం డ్యామ్ :- 697.00 మీ
FRL :- 697.14 మీ
నిల్వ సామర్థ్యం :- 5240.00 లక్షల గ్యాలన్లు
ప్రస్తుత నిల్వ :- 5192.00 లక్షల గ్యాలన్లు
2) గోగర్భం డ్యామ్ :- 2894.00 అడుగులు
FRL :- 2894.00 అడుగులు
నిల్వ సామర్థ్యం :- 2833.00 లక్షల గ్యాలన్లు
ప్రస్తుత నిల్వ :- 2833.00 లక్షల గ్యాలన్లు
3) ఆకాశగంగ డ్యామ్ :- 865.00 మీ
FRL :- 865.00 మీ.
నిల్వ సామర్థ్యం :- 685.00 లక్షల గ్యాలన్లు
ప్రస్తుత నిల్వ :- 685.00 లక్షల గ్యాలన్లు
4) కుమారధార డ్యామ్ :- 898.15 మీ
FRL :- 898.24మీ
నిల్వ సామర్థ్యం :- 4258.98 లక్షల గ్యాలన్లు
ప్రస్తుత నిల్వ :- 4229.42 లక్షల గ్యాలన్లు
5) పసుపుధార డ్యామ్ :- 898.15 మీ
FRL :- 898.24మీ
నిల్వ సామర్థ్యం :- 1287.51 లక్షల గ్యాలన్లు
ప్రస్తుత నిల్వ :- 1267.48 లక్షల గ్యాలన్లు