నటుడు అల్లు అర్జున్‌ను హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ఫ 2 సినిమా చూసేందుకు సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనిపై అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాజాగా నటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అల్లు అర్జున్‌తో పాటు ఆయన తండ్రి అరవింద్ కూడా ఉన్నారు. పోలీసులు ఏ స్టేషన్‌కు తరలిస్తారనే విషయం గుట్టుగా ఉంచారు. స్టేషన్‌కు తరలించి విచారించిన తరవాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది. కోర్టు తీర్పు మేరకు జైలుకు తరలించనున్నారు.