డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహణ
ఏపీ పోలీసు నియామక మండలి నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల నిర్వహణపై స్పష్టత ఇచ్చింది. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
కానిస్టేబుల్ పరీక్షల(స్టేజ్–2) కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు, హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలు కల్పించింది. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌లైన్ నంబర్లు 9441450639, 9100203323ను విడుదల చేసింది. పనిదినాల్లో ఆఫీసు పనివేళల్లో ఈ నెంబరకు కాల్ చేసి అభ్యర్థుల తమ సందేహాలను తీర్చుకోవచ్చు.