తమిళనాడులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సజీవదహనం అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
తమిళనాడు దిండుక్కల్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో ఘోరం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంటలు అంటుకున్నాయి. తప్పించుకునే క్రమంలో కొందరు లిఫ్టులో ఎక్కి కిందకు దిగే ప్రయత్నం చేశారు. మంటలు కారణంగా లిఫ్ట్ పనిచేయలేదు. లిప్టులో మంటలు అంటుకుని ఏడుగురు సజీవ దహనం అయ్యారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉన్నారు. ఆసుపత్రి మంటల్లో మరో వందమంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
గత రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఆర్పేందుకు 4 ఫైరింజన్లు తెప్పించారు. ఆసుపత్రి నుంచి రోగులు కాలిన గాయాలతో బయటపడ్డారు. వారిని 50 అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు చేర్చారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. మంత్రులు, కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదముంది.