సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కూడా వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. వైసీపీలో ఇప్పటివరకు కీలక నేతలుగా ఉన్న పలువురు ఆ పార్టీని వీడుతున్నారు.
ఇప్పటికే బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ లు వైసీపీ ద్వారా తమకు సంక్రమించిన రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని వదులుకుని ఆ పార్టీని వీడారు. బీద మస్తాన్ రావు టీడీపీ నుంచి పెద్దల సభకు నామినేట్ కాగా, ఆర్ కృష్ణయ్య బీజేపీ తరఫున మరోసారి రాజ్యసభలోకి అడుగుపెడుతున్నారు.
తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి అవంతీ శ్రీనివాస్ కూడా వైసీపీని వీడారు. ఇదే కోవలోకి మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేరారు. భీమవరం నుంచి గతంలో వైసీపీ తరఫున గ్రంథి శ్రీనివాస్ శాసనసభ కు ప్రాతినిధ్యం వహించారు. అవంతి వైసీపీని వీడిన కాసేపటకే ఆయన కూడా పార్టీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను 2019 ఎన్నికల్లో ఓడించిన ఘనత గ్రంధి శ్రీనివాస్ కు ఉంది. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు చేతిలో ఓడారు.