రాజమండ్రి నుంచి దిల్లీకి వెళ్లాలనుకునే వారికి కేంద్రవిమానయానశాఖ శుభవార్త చెప్పింది. రాజమండ్రి మధురపూడి ఎయిర్ పోర్టు నుంచి దిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టుకు ఇకపై నేరుగా విమాన సర్వీసులు నడవనున్నాయి.
ఇవాళ ఉదయం దిల్లీ నుంచి రాజమండ్రికి వచ్చిన మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ పురందేశ్వరి ప్రయాణం చేశారు. అనంతరం రాజమండ్రి నుంచి దిల్లీకి వెళ్లింది. నేటి నుంచి ఈ రెండు సర్వీస్ లు అందుబాటులోకి వచ్చాయి.
ఉదయం తొమ్మిది గంటలు, రాత్రి 7 గంటలకు ఈ విమానాలు రాజమండ్రి విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నాయి. రాజమండ్రి నుంచి దిల్లీకి టికెట్ ధర రూ. 5500గా నిర్ణయించారు.