వీధులన్నీ జలమయం, భక్తులు ఇక్కట్లు
రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
నిండిన జలాశయాలు
తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో భారీ వాన కారణంగా స్థానికులు నానా యాతనపడ్డారు. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సిబ్బంది సూచిస్తున్నారు .
వాన కారణంగా పలు రహదారుల్లో భారీగా నీరు నిలవడంతో
పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. పాపవినాశనం, గోగర్భం డ్యామ్ లు పూర్తిగా నిండాయి.
తిరుపతిలో వీధులన్నీ జలమయంగా మారాయి. రైల్వే అండర్ బ్రిడ్జి వర్షపు నీటితో నిండింది. బాలాజీ కాలనీ నుంచి మహిళా యూనివర్సిటీ మీదుగా వాహనాల రాకపోకలు మళ్ళించారు. ముందు జాగ్రత్తగా కపిలతీర్థం పుష్కరిణికి భక్తులు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. మాల్వాడిగుండం జలపాతం పొంగుతోంది.