మార్చి 1 నుంచి 19 వరకు మొదటి సంవత్సరం పరీక్షలు
మార్చి 3 నుంచి 20 వరకు రెండో ఏడాది పరీక్షలు
ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల తేదీలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మొదటి, రెండో ఏడాది పరీక్షలు ఏఏ తేదీల్లో నిర్వహిస్తారో వివరిస్తూ బోర్డు కార్యదర్శి కృతిగా శుక్లా ప్రకటన విడుదల చేశారు.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 2025 మార్చి 1 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 3 నుంచి మార్చి 20 వరకు ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు.
ఒకేషనల్ కోర్సులకు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు రోజుకు రెండు సెషన్స్ చొప్పున నిర్వహించనున్నారు. ఎథిక్స్ & హ్యుమన్ వాల్యూష్ పరీక్షను ఫిబ్రవరి 1న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఫిబ్రవరి 3న ఉదయం 10.00 నుంచి 01.00 గంటల వరకు నిర్వహించనున్నారు. సమగ్ర శిక్ష వొకేషనల్ ట్రేడ్ ఎగ్జామినేషన్ పరీక్షలు ఫిబ్రవరి 22 నిర్వహించనున్నారు.