షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 17 నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. మార్చి 17 నుంచి మార్చి 31 వరకు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష జరగనుంది.
మార్చి 17న ఫస్ట్ లాంగ్వేజ్ , 19న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లిషు పరీక్షలు నిర్వహించనున్నారు. 24న గణితం, 26న ఫిజికల్ సైన్స్, 28న బయోలాజికల్ సైన్స్, 31న సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ తెలిపింది.
పదో తరగతి విద్యార్థులను ఉద్దేశించి మంత్రి నారా లోకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ పనిదినాల్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. బాగా చదివి అద్భుతమైన మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘ పదో తరగతి తమ్ముళ్లకు, చెల్లెళ్లకు ఆల్ ది వెరీ బెస్ట్” అంటూ లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.