రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్‌గా ఐఏఎస్ అధికారి సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టారు. ఆర్బీఐ 26వ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు గవర్నర్‌గా పనిచేసిన శక్తికాంత దాస్ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రాను కేంద్రం, ఆర్బీఐ చీఫ్ గా నియమించింది. మూడేళ్ళపాటు ఈ పదవిలో సంజయ్ కొనసాగుతారు.
ఐఐటీ కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ కోర్సు చదివిన సంజయ్ ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 33ఏళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలు శాఖల్లో సేవలందించారు.
రిజర్వ్ బ్యాంక్ 25వ గవర్నర్‌గా శక్తికాంత ఆరేళ్ల పాటు పనిచేశారు. అంతకు ముందు గవర్నర్ గా ఉన్న ఊర్జిత్ పటేల్ అనూహ్య రాజీనామాతో 2018 డిసెంబర్ 12న బాధ్యతలు చేపట్టారు.