నటుడు మోహన్‌బాబు, తన కుమారుడు మంచు మనోజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మోహన్‌బాబు ఫిర్యాదు మేరకు మంచు మనోజ్, ఆయన భార్య మౌనికపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసానికి వచ్చి, తనపై దాడికి ప్రయత్నం చేశారంటూ మోహన్‌బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మోహన్‌బాబుపై తనయుడు మనోజ్ హైదరాబాద్‌లోని పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రి కిరాయి రౌడీలతో తనపై దాడి చేయించాడని, మెడికల్ రిపోర్టుతో సహా ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన తండ్రి ఆస్తి కోసం తాను పాకులాడటం లేదని మనోజ్ మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు.
మంచు ఫ్యామిలీలో ఆస్తుల గొడవలు రోడ్డున పడ్డాయి. మంచు విష్ణు, మంచు లక్ష్మి సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. తిరుపతి సమీపంలోని శ్రీవిద్యానికేతన్ సంస్థలో అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఇటీవల మనోజ్ చేసిన వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది.