శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కైలాసద్వారం, హఠకేశ్వరం, క్యూకాంప్లెక్స్ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులు గురించి ఆరా తీశారు.
భీమునికొలను మెట్లమార్గం, కైలాస ద్వారం వద్ద జంగిల్ క్లియరెన్స్ పనులు అటవీశాఖ అధికారులతో కలిసి చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. కైలాసద్వారం వద్ద చలువపందిళ్లు, తాత్కాలిక షెడ్లు, తాగునీటి వసతి, తాత్కాలిక విద్యుద్దీకరణ తదితర ఏర్పాట్లను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
శ్రీశైలం దేవస్థానం ప్రసారం చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులు తిలకించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్‌లో తొక్కిసలాట జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. అవసరమైతే సహాయ సహకారాలు తీసుకోవాలని సూచించారు. ఈవో వెంట ఎఫ్ఆర్వో సుభాష్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.