భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రాను నియమించింది. ఆ మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఇవాళ డిసెంబర్ 9న ఆమోదముద్ర వేసింది.
సంజయ్ మల్హోత్రా 1990 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో రెవెన్యూ విభాగంలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 11న పదవీ బాధ్యతలు చేపడతారు. ఆయన ఆ పదవిలో మూడేళ్ళపాటు ఉంటారు. మల్హోత్రా ఐఐటి కాన్పూర్లో కంప్యూటర్ సైన్స్ అధ్యయనం చేసారు. ఆ తర్వాత అమెరికా న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసారు.
ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్న శక్తికాంత దాస్ పదవీకాలం డిసెంబర్ 10 అంటే రేపు మంగళవారంతో ముగుస్తుంది.