ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి విజయం సాధించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాకినాడలోని జేఎన్టీయూలో ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో గోపీమూర్తి 9165 ఓట్లు సాధించి మొదటి ప్రాధాన్య ఓట్లతోనే విజయం సాధించారు.
స్వతంత్ర అభ్యర్థి గోపీమూర్తికి పీడీఎఫ్ మద్దతు పలికింది.
మరో అభ్యర్థి గంధం నారాయణరావు 5259 ఓట్లు సాధించారు. ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తం 15494 ఓట్లు పోలయ్యాయి. అందులో 814 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. కాసేపట్లో గోపీమూర్తి విజయాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.