రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్యకు అవకాశం దక్కింది. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కృష్ణయ్య, ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం తరవాత రాజీనామా చేశారు. కృష్ణయ్యతోపాటు, మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు కూడా రాజీనామా సమర్పించారు. ఏపీలో మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక హర్యానా నుంచి రేఖాశర్మ, ఒడిషా నుంచి సుజిత్ కుమార్ పేర్లను బీజేపీ ప్రకటించింది.
బీసీ నేతగా ఆర్ కృష్ణయ్య గుర్తింపు తెచ్చుకున్నారు. మూడు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. బీసీల జాతీయ అధ్యక్షుడిగా ఆర్ కృష్ణయ్య సేవలందిస్తున్నారు.