సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘ఫియర్’ సినిమా డిసెంబర్ 14న విడుదల కానుంది. ఆ నేపథ్యంలో సినిమా ట్రయిలర్ ఇవాళ విడుదల చేసారు.
వేదిక, అరవింద్ కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఇప్పటికే సుమారు 40 అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. 70 పురస్కారాలు గెలుచుకుంది. ఉత్తమ చిత్రంగా 40 అవార్డులు, ఉత్తమ దర్శకత్వానికి 14 అవార్డులు, ఉత్తమ నటి కేటగిరీలో 4 అవార్డులు, ఇతర విభాగాల్లో 12 అవార్డులు సాధించింది.
అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాకు డా. హరిత గోగినేని దర్శకత్వం వహించారు. రాబోయే శనివారం నాడు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.