తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన సంఘటనలు మత సామరస్యానికి, తమ మత ధర్మాలను అనుసరించడంలో హిందువుల హక్కులకు భంగం కలుగుతున్న తీరుకు నిదర్శనంగా నిలిచాయి. అయ్యప్ప భక్తులను, అందునా ముఖ్యంగా దళితులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసారన్న వార్తలు వెలుగు చూసాయి. ఆ సంఘటనలు ముస్లిములు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మతపరంగా మైనారిటీలు అయినవారు ఎదుర్కొంటున్న సవాళ్ళను సమాజానికి తెలియచెప్పాయి. అదే సమయంలో హిందువుల హక్కుల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తీరును కళ్ళకు కట్టాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటి నగరంలో అయ్యప్ప భక్తులు ఒక వాహనంలో వెడుతుండగా ముస్లిముల మూక ఆ వ్యాన్‌పై దాడి చేసింది. అయ్యప్ప భక్తులు భజన చేసుకుంటూ ఉండగా వారి వాహనం వెడుతున్న మార్గాన్ని ముస్లిం మూక బలవంతంగా మూసివేసింది. వారి వాహనంపై దాడి చేసింది. వాహనం అద్దాలు పగలగొట్టి, డ్రైవర్‌పై దాడి చేసారు. బస్సులోని అయ్యప్ప భక్తులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో అక్కడ స్థానిక పోలీసులు ఉన్నప్పటికీ, వారు జోక్యం చేసుకుని దుండగులను నిలువరించలేదు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ముస్లిములు మూకదాడి చేస్తున్నప్పుడు సైతం పోలీసులు పట్టించుకోలేదు, వారి దాడిని నిలువరించలేదు. హిందువులపై హింసాకాండ జరుగుతున్నా చూస్తూ ఉండిపోయారు. దాంతో పోలీసుల వైఖరిపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. హిందూ భక్తులకు ఉన్న రాజ్యాంగపరమైన హక్కులను రక్షించడంలో ఉదాసీనంగా ఉండిపోయారు.
అటువంటిదే మరో సంఘటన తమిళనాడులోని తిరువారూరు జిల్లాలో చోటు చేసుకుంది. కూత్తనల్లూర్ ప్రాంతంలో దేవేంద్రకుల వెల్లలార్ కులానికి చెందినవారే ఎక్కువ. ఆ ప్రాంతానికి చెందిన, వెల్లలార్ కులానికి చెందిన దళితులు సుమారు 50మంది అయ్యప్ప భక్తులపై మారియమ్మన్ గుడి దగ్గర వారిపై ముస్లిములు దాడి చేసారు. అయ్యప్ప దీక్ష పూర్తిచేసుకుని శబరిమలకు యాత్రగా వెళ్ళే క్రమంలో మారియమ్మన్ గుడికి వెళ్ళి అక్కడ భజనలు పాడుకుంటూ ఉండగా వారిపై ముస్లిములు దాడులకు తెగబడ్డారు.
హిందువులు భజనలు చేసుకోవడం హరామ్ కాబట్టి, వారిని లక్ష్యంగా చేసుకుని షేక్ ఫజల్, అబ్దుల్ కాదర్, సద్దాం హుసేన్ నేతృత్వంలోని ముస్లిం మూక దాడికి పాల్పడింది. అర్ధరాత్రి సమయంలో దాడి చేయడంతో అయ్యప్ప భక్తులు కనీసం ఆత్మరక్షణ చేసుకోవడానికైనా ఏమాత్రం సిద్ధంగా లేరు. అంటే ముస్లిం మూక ఒక ప్రణాళిక ప్రకారమే ఆ దాడికి పాల్పడిందని అర్ధమవుతుంది.
స్థానిక పోలీసులు మాత్రం, యధావిధిగా జరిగిన సంఘటనను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసారు. జరిగిన సంఘటనకు నిందితులు మద్యం మత్తులో ఉండడమో లేక వారి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడమో కారణమంటూ అసలైన నిందితులను తప్పించేందుకు చూసారు. అసలు సంఘటనకు మసిపూసి మారేడుకాయ చేసే ఆ ప్రయత్నాన్ని హిందువులు తీవ్రంగా తప్పుపట్టారు. హిందువులపైన, వారి ఆలయాలపైనా దాడులు జరిగిన ప్రతీసారీ ఇలాంటి కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు.
ఏకపక్ష మత సామరస్యం ఫలితాలు:
ముస్లిముల జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వారు హిందువులపై పగ, ప్రతీకార భావాలతో రగిలిపోతూ దాడులు చేస్తుండడంలో ఒక సరళి కనిపిస్తోందని హిందూ సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ముస్లిములు మైనారిటీలుగా ఉన్నచోట్ల వారు మత సామరస్యాన్ని పాటిస్తున్నట్లు కనిపిస్తారు. ఒకసారి వారు అధిక సంఖ్యాకులు కాగానే వారి వైఖరి మారిపోతుంది, ఆ ప్రాంతంలో ఇంకెవరూ ఉండకూడదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. దేశవ్యాప్తంగా వారి విధానం ఇలాగే ఉంటోందని గమనించినట్లు హిందూ సంఘాలు వివరిస్తున్నాయి. తమ మసీదులను విస్తరణ ప్రయత్నాల్లో ఎంతవరకైనా వెళ్ళడం, హిందువుల ఊరేగింపులు, భజనలపై దాడులు చేయడం వంటి చర్యలు హిందువుల్లో అభద్రతాభావాన్ని, ఒంటరిగా బలహీనులమైపోతున్నామన్న భావాన్నీ కలిగిస్తున్నాయి. మతోన్మాదంతో తమపై ముస్లిములు దాడిచేస్తుంటే కనీసం ఆత్మరక్షణ చేసుకోలేనంత నిర్వీర్యతలోకి హిందువులు దిగజారిపోయారు.
ప్రభుత్వ విధానాల్లో పక్షపాత ధోరణి:
దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల ప్రభుత్వాలు ముస్లిములను బుజ్జగించే పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, దశాబ్దాలుగా అదే జరుగుతూ వస్తోంది. ముస్లిములు, క్రైస్తవులు ఉండే ప్రాంతాల్లో హిందువులు తమ పండుగలు జరుపుకోకూడదంటూ ప్రభుత్వాధికారులే నియంత్రిస్తున్నారు. అలాంటిచోట్ల హిందువులు చిన్న ఊరేగింపు చేసుకోడానికి వీల్లేదు. వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు, ధార్మిక కార్యక్రమాల్లో పండాల్స్ ఏర్పాటు చేసుకోకుండా ఉత్తర్వులు, ప్రత్యేక పూజలకు అనుమతి నిరాకరణలు మన కళ్ళెదుటే కనిపిస్తున్నాయి.
ఈ రకమైన పక్షపాత ధోరణి పెద్దపెద్ద నాయకులకు సైతం ఎదురవుతోంది. ఉదాహరణకు, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాంచీపురం సందర్శించినప్పుడు తమిళనాడు పోలీసులు అక్కడి పండాల్‌ను పడగొట్టేసారు. నిర్మల పాల్గొంటున్న ధార్మిక కార్యక్రమానికి సంబంధించి పెట్టుకున్న సౌండ్ సిస్టమ్‌ను పోలీసులే తొలగించేసారు. ప్రభుత్వ అధికారులు మైనారిటీల సెంటిమెంట్లకు విలువనిచ్చే పేరుతో మెజారిటీ మతస్తుల హక్కులను అడ్డుకుంటున్నారని ఆ సంఘటనను బట్టే అర్ధమవుతుంది.