ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్‌పై బంగ్లాదేశ్‌లో మరో కేసు నమోదైంది. మైనారిటీ హిందువులపై దాడులను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణదాస్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్మోయ్ తరపున వాదించేందుకు వచ్చిన న్యాయవాదిని కొందరు అరాచకవాదులు కొట్టి చంపారు. కృష్ణదాస్ తరపున వాదించేందుకు న్యాయవాదులు ఎవరూ ముందుకు రాకపోవడంతో కేసును వచ్చే నెలకు వాయిదా వేశారు.
తాజాగా కృష్ణదాస్‌పై మరో కేసు నమోదైంది. చిన్మోయ్ తరపున కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఢాకా కోర్టు వద్ద జరిగిన ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలో ఇనాముల్ హక్ అనే వ్యక్తి గాయపడ్డానంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనతోపాటు మరో 400 మంది గాయపడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇనాముల్ హక్ ఫిర్యాదుపై పోలీసులు కృష్ణదాస్‌పై మరో కేసు నమోదు చేశారు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఢాకాలో మరో ఇన్కాన్ దేవాలయాన్ని ధంసం చేశారు. తాత్కాలిక ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. దీంతో హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయి. నిరసనలకు దిగిన వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. చిన్మోయ్‌ని ఉంచిన జైలు వద్ద కూడా శనివారంనాడు హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
మైనార్టీ హిందువులపై దాడులు, దేవాలయాల ధ్వంసం ఆపడంలో బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక యూనస్ ప్రభుత్వం విఫలమైందని విశ్వహిందూ పరిషత్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మైనార్టీ హిందువులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.