అండర్ 19 ఆసియా కప్ -2024లో భాగంగా బంగ్లాదేశ్ తో దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఓడింది. చివరి వరకు పోరాడి 59 పరుగుల తేడా పరాజయాన్ని మూటకట్టుకుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ , భారీ స్కోర్ చేయకుండా భారత బౌలర్లు కట్టడి చేశారు. బంగ్లాదేశ్ జట్టు 49.1 ఓవర్లలో 198 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. రిజ్వాన్ హసన్( 47), మహ్మద్ షిహాబ్ జేమ్స్( 40), ఫరీద్ హసన్ ఫైజల్( 39), జవాద్ అన్వర్ (20) పరుగులు చేశారు. కలామ్( 1), అజిజుల్( 16), బసిర్( 4), ఫహాద్( 1), మరుఫ్ (11) వెంటనే వెనుదిరిగారు. భారత బౌలర్లలో యుధాజిత్ గుహా , చేతన్ శర్, హార్దిక్ రాజ్ తలా రెండు చొప్పున వికెట్లు తీశారు. కిరణ్, కేపీ కార్తికేయ, ఆయుష్ మాత్రే తలో వికెట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు.
అనంతరం, 199 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఆయుష్ మాత్రే (1), వైభవ్ సూర్యవంశీ( 9) వెంటనే ఔట్ కావడంతో జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఏ ఒక్కరూ భారీ స్కోర్ చేయలేకపోయారు.
ఆండ్రూ సిద్ధార్థ్ 35 బంతులు ఆడి 20 పరుగులు చేసి ఔట్ కాగా, కేపీ కార్తికేయ 43 బంతులు ఆడి 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ మొహమ్మద్ అమాన్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. 60 బంతులు ఆడి 26 బంతులు ఆడి 8వ వికెట్ గా వెనుదిరిగాడు.
నిఖిల్ కుమార్ (0), హర్వాన్ష్ పంగాలియా (6)కిరణ్ ఖర్మోల్ (1) , విఫలమయ్యారు. హర్థిక్ రాజ్ (24) పోరాడినప్పటికీ ఎల్బీ రూపంలో దురదృష్టం వెంటాడింది. ఆ తర్వాత చేతన్ శర్మ (10) ఆఖరి వికెట్ గా వెనుదిరిగాడు. భారత్ 35.2 ఓవర్లలో 139 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్ 59 పరుగులు తేడాతో విజయం సాధించింది.